: పాక్‌కు వ్యతిరేకంగా మాట్లాడలేదు, నా ట్వీట్లను వాళ్లు తమకు కావల్సిన రీతిలో వక్రీకరించుకున్నారు: అద్నాన్ సమీ
భారత్ పౌరసత్వం పొందిన ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు అద్నాన్ సమీ ఉగ్రవాదంపై మాట్లాడుతూ పాకిస్థాన్‌పై పలు వ్యాఖ్యలు చేశాడు. తాను ఇటీవల ట్విట్టర్‌లో పలు వ్యాఖ్యలు చేసినట్లు, వాటిని పాకిస్థాన్‌లో ఎవరికి కావాల్సిన రీతిలో వారు వక్రీకరించుకున్నారని అన్నాడు. తాను పాక్‌కు వ్యతిరేకంగా అస్సలు మాట్లాడలేదని పేర్కొన్నాడు. తాను దేవుడికి తప్ప వేరెవరికీ భయపడబోనని అన్నారు. తాను తిరిగి పాక్‌కు వెళ్లే పరిస్థితి వచ్చినా మళ్లీ ఆ దేశానికి వెళ్లడానికి భయపడేది లేదని పేర్కొన్నాడు. తాను భారత్, పాక్‌లకు ఉన్న ఉమ్మడి శత్రువుపైనే వ్యాఖ్యలు చేసినట్లు అద్నాన్ సమీ చెప్పాడు. అన్ని దేశాల్లోనూ ఉగ్రవాదాన్ని పూర్తిగా నాశనం చేయాలని అన్నాడు. అలాంటి ఉగ్రవాదులను తాజాగా భారత సైన్యం హతమార్చినందుకు వారికి పాకిస్థాన్ కృతజ్ఞతలు చెప్పాలని ఆయన వ్యాఖ్యానించాడు. తాము కూడా ఉగ్రవాద బాధితులమేనని ఆ దేశం ఎప్పటినుంచో చెబుతోందని ఆయన అన్నారు. ఇండియా సాయం చేస్తోన్నా ఆ సాయాన్ని ఒప్పుకొనే పరిస్థితిలో కూడా పాక్ లేదని అన్నాడు.