: ఎయిర్ ఫేర్ వార్ లో స్పైస్ జెట్... రూ. 888కి అన్ని పన్నులతో టికెట్లు


ఇప్పటికే ఎయిర్ ఆసియా, ఇండిగో వంటి సంస్థలు పండగ సీజన్ విమాన టికెట్ల విక్రయాలను ప్రారంభించిన వేళ, పోటీలోకి స్పైస్ జెట్ కూడా దిగింది. దేశవాళీ రూట్లలో రూ. 888 (అన్ని పన్నులతో కలుపుకుని), అంతర్జాతీయ రూట్లలో రూ. 3,699కి టికెట్లు అందిస్తామని తెలిపింది. రూ. 888 ధరపై వన్ వే టికెట్లు బెంగళూరు - కొచ్చి, ఢిల్లీ - డెహ్రాడూన్, చెన్నై - బెంగళూరు రూట్లలో అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ నెల 4 నుంచి 7 తేదీ అర్ధరాత్రి వరకు తెరచి వుండే అమ్మకాల్లో టికెట్లు బుక్ చేసుకుని, నవబంర్ 8 నుంచి వచ్చే సంవత్సరం ఏప్రిల్ 13 మధ్య ప్రయాణ తేదీని నిర్ణయించుకోవాలని సంస్థ తెలిపింది. కాగా, స్పైస్ జెట్ వెబ్ సైట్ ను పరిశీలిస్తే, ఢిల్లీ - ముంబై రూట్ లో డిసెంబర్ నెల ప్రయాణానికి రూ. 2,200 ధర కనిపిస్తోంది. మరో లోకాస్ట్ ఎయిర్ వేస్ సంస్థ ఎయిర్ ఆషియా దేశీయ, అంతర్జాతీయ తగ్గింపు ధరలను ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News