: అపోలో ఆసుపత్రి ముందు నేలపైనే అన్నం వడ్డించుకుని తింటున్న జయ అభిమానులు
చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఆసుపత్రికి సమీపానికి జయలలిత అభిమానులు భారీగా చేరుకుంటున్నారు. ఆసుపత్రి ముందే వారు పూజలు నిర్వహిస్తున్నారు. పలువురు మహిళలు జయ చికిత్స తీసుకుంటున్న ఆసుపత్రి ముందు ఉన్న నేలపై అన్నం వడ్డించుకుని, సాంబారు కలుపుకొని తిన్నారు. పూల దండలు వేసుకొని అన్నాన్నే ప్రసాదంలా భావిస్తూ తింటున్నారు. జయలలిత ఆరోగ్యంగా బయటకు రావాలని కోరుకున్నారు. అమ్మ కోలుకుంటే మొక్కులు చెల్లించుకుంటామని అంటున్నారు.