: నిడదవోలు సమీపాన కాలువలోకి దూకిన యువతి.. కాపాడిన భవానీ భక్తులు!
పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు దగ్గర దివ్య అనే యువతి గోదావరి కాలువలోకి దూకి, ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. దీనిని గమనించిన అక్కడి భవానీ భక్తులు వెంటనే స్పందించి కాపాడారు. కాలువలో ఆమె సుమారు రెండు కీలోమీటర్ల దూరం కొట్టుకుపోయింది. ఆమెను రక్షించడానికి భవానీ భక్తులు నీటిలో దూకిన తరువాత అక్కడి పలువురు సిబ్బంది కూడా ఆమెను కాపాడేందుకు దూకారు. అనంతరం ఆ యువతిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. దివ్య నీళ్లు మింగిందని, ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు. ఆమెను రక్షించిన భవానీ భక్తులు మాట్లాడుతూ ఆమె తమకళ్లముందే నీటిలో దూకినట్లు చెప్పారు. దివ్య తల్లిదండ్రులకు సమాచారం అందించినట్లు చెప్పారు. కుటుంబ కలహాల కారణంగానే ఆమె ఈ పనిచేసినట్లు తెలుస్తోంది.