: పంజాబ్‌లో పాకిస్థాన్‌కు చెందిన పడవ స్వాధీనం


పాకిస్థాన్ కవ్వింపు చర్యలను కొనసాగిస్తూనే ఉంది. భారత్‌లో క‌ల‌క‌లం రేపేందుకు అన్ని ప్ర‌య‌త్నాల‌ను చేస్తోంది. స‌రిహ‌ద్దు ప్రాంతాల్లో పాకిస్థాన్ సైన్యం కాల్పుల విర‌మ‌ణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ దుస్సాహ‌సానికి దిగుతుండ‌గా.. మ‌రోవైపు ఉగ్ర‌వాదులు దేశంలోకి ప్ర‌వేశించ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈరోజు ఉద‌యం భార‌త భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌కి పంజాబ్‌లోని రావి నది వద్ద పాకిస్థాన్‌కు చెందిన పడవ క‌న‌బ‌డింది. దాన్ని స్వాధీనం చేసుకున్న భ‌ద్ర‌తాబ‌ల‌గాలు ఆ పడవను దుండగులు వదిలి వెళ్లినట్లు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News