: తిరుమలలో చిరు జల్లులు... స్వామికి రక్షణగా ఘటాటీపం
తిరుమల శ్రీవెంకటేశ్వరుని సాలకట్ల బ్రహ్మోత్సవాల రెండవ రోజున చిన్న శేష వాహన సేవ జరుగుతున్న వేళ, వరుణుడు పలకరించాడు. స్వామిని సేవించుకునేందుకే వరుణుడు వచ్చాడని భక్తులు వ్యాఖ్యానిస్తుండగా, వెనకాల వస్తూ ఉండే ఘటాటీపం (పెద్ద గుడారాల ఆకారంలోని గొడుగు) వెంటనే స్వామికి రక్షణగా వచ్చి చేరింది. ప్రస్తుతం ఘటాటీపం కింద స్వామివారు విహరిస్తుండగా, జల్లుల్లో తడుస్తూనే భక్తులు పరమానంద భరితులై దేవదేవుని దర్శించి తరిస్తున్నారు. నిన్న సాయంత్రం ధ్వజారోహణం, ఆపై పెద్ద శేష వాహనంపై ఊరేగింపుతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే.