: బుడిబుడి అడుగుల మనవడితో ముద్దు ముచ్చట్లు... చంద్రన్న మోమున అమితానందం!
అమరావతి నిర్మాణం, ప్రజా సంక్షేమం, జిల్లాల పర్యటనలు, అభివృద్ధి కార్యక్రమాల నేపథ్యంలో అలసి సొలసే చంద్రబాబు మోమున అమితానందం కనిపించింది. గత కొంతకాలంగా హైదరాబాద్ లో కాస్తంత సమయాన్ని మనవడు దేవాంశ్ తో గడిపేందుకు దొరకనంత బిజీగా ఉన్న ఆయన, తీరిక చేసుకుని ఆదివారం వచ్చారు. తన మనవడు దేవాంశ్ ను చూడక చాలా రోజులయ్యిందో ఏమో, నిన్న దగ్గరుండి తన చేతులతో టిఫిన్ తినిపించారు. ఎత్తుకుని ఆడించారు. కాసేపు దేవాంశ్ తో కలసి చంద్రబాబు దంపతులు మార్నింగ్ వాక్ చేశారు. ఆ సమయంలో చంద్రబాబు ముఖం అమితానందంతో నిండిపోగా, ఆ చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ చిత్రాన్ని మీరూ చూడండి