: కళ్లు తెరచి చూసిన జయలలిత, కాసేపు వెంటిలేటర్ తొలగింపు


గత రెండు వారాలుగా రక్తనాళాల్లో తీవ్రమైన ఇన్ఫెక్షన్ కారణంగా చికిత్స పొందుతున్న తమిళనాడు సీఎం జయలలిత స్వల్పంగా కోలుకున్నారు. ఆమె కళ్లు తెరచి చూసినట్టు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఊపిరి స్వయంగా పీల్చుకుంటుంటే, కాసేపు వెంటిలేటర్ ను సైతం తొలగించినట్టు తెలిసింది. ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని వచ్చిన వార్తలు, అందుకు మద్దతునిస్తూ, గత రాత్రి విడుదలైన ఆసుపత్రి బులెటిన్ తరువాత ఏఐఏడీఎంకే వర్గాలు ఆనందాన్ని వ్యక్తం చేశాయి. జయలలిత వైద్యానికి స్పందిస్తుండటం, ఆమె ఆరోగ్యం మెరుగుపడటంతో, లండన్ నుంచి వచ్చిన ప్రత్యేక వైద్యుడు రాబర్ట్ బాలే తిరిగి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. కాగా, మరో పది రోజుల పాటు ఆమె ఆసుపత్రిలోనే ఉండాల్సి రావచ్చని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఆమెకు ప్రస్తుతం శక్తిమంతమైన యాంటీ బయాటిక్స్ ఇస్తూ, ఇన్ఫెక్షన్ ను మరింతగా తగ్గించేందుకు కృషి చేస్తున్నట్టు వైద్యులు తెలిపారు.

  • Loading...

More Telugu News