: నాలుగు రోజులుగా పత్తా లేని ‘ఆరోగ్య శ్రీ’ సేవలు.. ప్రభుత్వం విడుదల చేసిన రూ.250 కోట్ల బకాయిలు సరిపోవంటున్న ఆస్పత్రులు
తెలంగాణలోని మెజారిటీ ఆస్పత్రుల్లో గత నాలుగు రోజులుగా ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పేరుకుపోయిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పలు ఆస్పత్రులు ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వం రూ.250 కోట్ల బకాయిలను విడుదల చేసింది. అయితే అవి ఏ మూలకూ సరిపోవని, రూ. 450 కోట్ల బకాయిలు చెల్లించాలని ఆస్పత్రులు కోరుతున్నాయి. కాగా ఆరోగ్య శ్రీ సేవలను ఏకపక్షంగా నిలిపివేయడంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సమ్మెలో లేని ఆస్పత్రులకు ముందుగా చెల్లింపులు చేయాలని నిర్ణయించింది. మరోవైపు చెల్లింపులు చేసే వరకు సమ్మె కొనసాగిస్తామని ఆస్పత్రుల యాజమాన్యాలు తెగేసి చెబుతున్నాయి.