: తాండూరు ఇండియా సిమెంట్స్ ఫ్యాక్టరీలో ప్రమాదం.. నిద్రిస్తున్న కార్మికుల పైనుంచి వెళ్లిన జేసీబీ.. ఇద్దరు దుర్మరణం
రంగారెడ్డి జిల్లా తాండూరులోని ఇండియా సిమెంట్స్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం జరిగింది. నిద్రిస్తున్న కార్మికుల పైనుంచి జేసీబీ వెళ్లడంతో ఇద్దరు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు కార్మికుల మృతితో ఫ్యాక్టరీలో విషాద ఛాయలు అలముకున్నాయి. చనిపోయిన కార్మికుల గురించిన వివరాలు అందాల్సి ఉంది.