: బుద్ధి మార్చుకోని పాక్.. సరిహద్దులో మరోమారు కాల్పుల ఉల్లంఘన
ప్రపంచం ఏమనుకుంటున్నా సరే తన బుద్ధిని మార్చుకోనని పాకిస్థాన్ తెగేసి చెబుతోంది. అందరూ చీ కొడుతున్నా తన ఉగ్ర బుద్ధిని మార్చుకోవడానికి ససేమిరా అంటోంది. తాజాగా సరిహద్దులో మరోమారు పాక్ దళాలు కాల్పుల ఉల్లంఘనను కాలరాశాయి. కల్సియాన్-నౌషరా సెక్టార్లో పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది. వెంటనే స్పందించిన భారత జవాన్లు పాక్ కాల్పులకు దీటుగా బదులిచ్చారు. ఉరీ ఘటన తర్వాత ఉడికిపోతున్న పాక్.. కాల్పుల విరమణను యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. అయితే భారత సైన్యం ముందు వారి కుయుక్తులు సాగడం లేదు.