: కశ్మీరీ వేర్పాటు వాదులకు ఇటలీ నుంచి నిధులు?

కశ్మీరీ వేర్పాటువాదులకు నిధులిచ్చిన పాకిస్థాన్ జాతీయులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గుర్తించింది. హురియత్ కాన్పరెన్స్‌ సభ్యుడు ఫిర్దౌస్ అహ్మద్ షాతో పాటు నల్లాబేగం అనే మరో మహిళకు ఇటలీలోని పాకిస్థాన్ జాతీయుల నుంచి వెస్టర్న్ యూనియన్ ద్వారా నిధులు అందాయి. ఈ నిధులకు సంబంధించి రెండు కేసుల్లో లెటర్ ఆఫ్ రొగేటరీని ఇటలీకి పంపించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. గతేడాది పిర్దౌస్ అహ్మద్ షా తరపున యార్ మహ్మద్ ఖాన్ యూరప్ నుంచి ఈ ప్రశ్నార్థకమైన నిధులను స్వీకరించినట్లు ఈడీ గత ఏడాది అభియోగపత్రాన్ని దాఖలు చేసింది. ఇటలీలో ఉంటున్న షబీనా కన్వల్ అనే పాకిస్థానీ మహిళ నల్లాబేగంకు పంపించింది. ఇలా అందిన మొత్తాన్ని కశ్మీర్ లో ఉగ్రవాదం బలోపేతానికి ఖర్చుచేసినట్టు ఈడీ అనుమానిస్తోంది. వీరికి ఇటలీ నుంచి నిధులు పంపించిన వ్యక్తికి ముంబై దాడులతో ప్రమేయం ఉందని ఈడీ అనుమానిస్తోంది. వీరిద్దరూ ఈ నిధులకు తగిన ఆధారాలను చూపించలేకపోయారని ఈడీ తెలిపింది. వీరి నుంచి మరిన్ని వివరాలను రాబట్టేందుకు దర్యాప్తు చేస్తున్నామని ఈడీ వెల్లడించింది.

More Telugu News