: అఖిల్ లవ్ విషయం తెలిసి షాకయ్యా: నాగచైతన్య
అఖిల్ లవ్ విషయం తెలిసి తాను షాక్ అయ్యానని, ఈ విషయాన్ని తానసలు ఊహించలేదని ప్రముఖ నటుడు నాగచైతన్య అన్నాడు. ఒక న్యూస్ ఛానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ‘అఖిల్ ప్రేమలో పడిన విషయాన్ని నాన్న కూడా ఊహించలేదు. ఒకరోజు, ఉన్నట్లుండి న్యూక్లియర్ బాంబు పేల్చినట్లు, ఈ విషయాన్ని చెప్పాడు. అయితే, ఈ విషయంలో మేమందరం చాలా సంతోషంగా ఉన్నాము. అఖిల్ చాలా తక్కువ టైమ్ లో తన ప్రేమ విషయమై నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషం’ అని నాగచైతన్య చెప్పాడు. సాధారణమైన విషయాల గురించే తాము కలిసినప్పుడు మాట్లాడుకుంటామని, సినిమాల గురించి మాట్లాడుకోవడం తక్కువని చెప్పాడు.