: రేపు కార్గిల్ లో పర్యటించనున్న రాజ్ నాథ్ సింగ్


పాకిస్థాన్ తన సైన్యాన్ని భారీగా మోహరిస్తున్న వేళ... ఎల్ఓసీ వెంబడి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌ నాథ్ సింగ్ రేపు జమ్మూలోని కార్గిల్, లేహ్ ప్రాంతాల్లో పర్యటించనున్నారు. అనంతరం అక్కడి భద్రతా అధికారులతో సమావేశమై ప్రస్తుత పరిస్థితులపై చర్చిస్తారు. అందులో భాగంగా కశ్మీర్‌ లో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వారి అభిప్రాయాలు తెలుసుకోనున్నారు. పాక్ దుందుడుకు చర్యలను అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చర్చించనున్నారు.

  • Loading...

More Telugu News