: నాటి హీరోయిన్లు నేటి ‘సినిమా’ కోసం ఇచ్చిన పోజ్ ఇది!
నాడు ఒక వెలుగు వెలిగిన దక్షిణాది హీరోయిన్లు ఊర్వశి, రాధిక, సుహాసిని, ఖుష్బూలు తాజాగా ఒక చిత్రంలో కలిసి నటిస్తున్నారు. నిజ జీవితంలో కూడా స్నేహితులైన ఈ నలుగురు హీరోయిన్లు ఈ చిత్రంలో కూడా మిత్రులుగానే నటిస్తున్నారు. స్నేహం, మహిళల బంధాలు, వినోదం ప్రధానాంశంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి జేమ్స్ వసంతన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ గత కొన్ని రోజులుగా ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో జరుగుతోంది. ఈ సందర్భంగా నలుగురు హీరోయిన్లు తమ సైకిళ్లపై కూర్చుని ఫొటోకు పోజ్ ఇచ్చారు. ఈ ఫొటోను రాధిక తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంది.