: బతుకమ్మ ఆడిన మండలి ఛైర్మన్ స్వామి గౌడ్
తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ బతుకమ్మ ఆడి అందర్నీ ఆకట్టుకున్నారు. హైదరాబాదులోని తెలంగాణ సచివాలయం ఉద్యోగులు సచివాలయంలో బతుకమ్మ పండగను నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా ఉద్యోగులంతా బతుకమ్మ ఆడి సందడి చేశారు. దీంతో సచివాలయ మహిళా ఉద్యోగులతో కలిసి స్వామిగౌడ్ బతుకమ్మ ఆడి ఆకట్టుకున్నారు. దీంతో అంతా హర్షం వ్యక్తం చేశారు. కాగా, గతంలో స్వామిగౌడ్ ఉద్యోగసంఘ నేతగా విజయవంతమైన సంగతి తెలిసిందే.