: ప్రధాని నుంచి నా వరకు అందరమూ డబ్బులు పంచినవాళ్లమే : జేసీ దివాకర్ రెడ్డి
ఓట్ల కోసం ప్రధాని నుంచి నా వరకు అందరమూ డబ్బులు పంచినవాళ్లమేనంటూ టీడీపీ నేత, ఎంపీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రత్యేక హోదా కోసం ప్రధాని మోదీని ఎవరూ ఏమీ అనలేని పరిస్థితి అని, బుద్ధి లేని వాళ్లే ప్రత్యేక హోదాపై మాట్లాడుతున్నారంటూ జేసీ దివాకర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత జగన్ చేస్తున్న దీక్షలు, భారత్-పాక్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై కూడా ఆయన స్పందించారు. జగన్ దీక్ష లతో ఎవరికీ ప్రయోజనం ఉండదని, ఆ దీక్షల వల్ల ఆయన ఆరోగ్యానికే మంచిదన్నారు. ఇక, పాకిస్థాన్ గురించి మాట్లాడుతూ, పాకిస్థాన్ సమస్య వందేళ్లయినా ఇలాగే ఉంటుందని, పాక్ పై యుద్ధం ప్రకటించడమే మంచిదని అభిప్రాయపడ్డారు. మన దేశంపై అణుబాంబులు వేసే సత్తా పాకిస్థాన్ కు లేదని జేసీ అన్నారు.