: సల్మాన్ ఖాన్ కంటే అతిపెద్ద తీవ్రవాది ఎవరూ లేరు: పోసాని కృష్ణమురళి
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ పై ప్రముఖ మాటల రచయిత, నటుడు పోసాని కృష్ణ మురళి మండిపడ్డారు. పాకిస్థాన్ నటులకు మద్దతుగా నిలిచిన సల్మాన్ పై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక ఇంటర్వ్యూలో పోసాని మాట్లాడుతూ, సల్మాన్ ఖాన్ అంత ఉత్తముడైతే, ఆరోజు తన కారు యాక్సిడెంట్ జరిగిన రోజున అక్కడే ఉండకుండా ఎందుకు పారిపోయాడని ప్రశ్నించారు. ఈ దేశంలో సల్మాన్ ఖాన్ కంటే పెద్ద తీవ్రవాది మరెవరూ లేరని పోసాని ఘాటుగా వ్యాఖ్యానించారు.