: రాజస్థాన్ లో కూలిన జాగ్వార్ విమానం
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు సంబంధించిన జాగ్వార్ (శిక్షణ విమానం) ఈరోజు కూలింది. రాజస్థాన్‌లోని పోఖ్రాన్ మీదుగా విమానం వెళుతోన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం బారినుంచి అందులోని ఇద్దరు పైలట్లు సురక్షితంగా తప్పించుకున్నట్లు సంబంధిత అధికారులు మీడియాకు చెప్పారు. విమానం కూలిన ఘటనకు సంబంధించిన కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై విచారణకు ఆదేశించినట్లు అధికారులు తెలిపారు.