: 15 మంది రెజ్లర్లకు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చిన రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా


క్రీడాకారులకు క్రమశిక్షణ అన్నది చాలా ప్రధానం. అందుకే, క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడే క్రీకాకారులకు ఆయా ఫెడరేషన్లు శిక్షలు వేస్తుంటాయి. తాజాగా రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కొందరు క్రీడాకారులకు ఇలాగే షాక్ ట్రీట్మెంట్ ఇచ్చింది. జూనియర్ స్థాయి రెజ్లర్లు ఈ మధ్య కాలంలో వరుసగా క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడుతుండడంతో పలుమార్లు హెచ్చరికలు చేసిన రెజ్లింగ్ సమాఖ్య ఇప్పుడు వారిపై ఏడాది పాటు సస్పెన్షన్ విధించింది. ఈ కఠిన చర్యలు 15 మంది జూనియర్ స్థాయి రెజ్లర్లపై తీసుకుంటున్నట్టు తెలిపింది. వీరంతా ఏడాదిపాటు ఎలాంటి రెజ్లింగ్ పోటీల్లో పాల్గొనకూడదని నిషేధం విధించింది. దీంతో 15 మంది జూనియర్ రెజ్లర్లు షాక్ కు గురయ్యారు.

  • Loading...

More Telugu News