: ఈడెన్ గార్డెన్స్ లో అశ్విన్ రికార్డు నమోదు... తన ఖాతాలో 400 వికెట్లు!
టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతున్న రెండో టెస్టులో కివీస్ బ్యాట్స్ మన్ రాస్ టేలర్ వికెట్ సాధించడం ద్వారా సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇంతవరకు మొత్తం 185 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లు ఆడిన అశ్విన్ ఇప్పటి వరకు 400 వికెట్లు తీసుకున్నాడు. కాగా, రవిచంద్రన్ అశ్విన్ ఇప్పటి వరకు ఆడిన 38 టెస్టుల్లో 25.06 సగటుతో 206 వికెట్లు కూల్చాడు. ఇందులో టెస్టుల్లో ఐదేసి వికెట్ల ఫీట్ ను 19 సార్లు సాధించాడు. అంతే కాకుండా ఇంతవరకు 102 వన్డే మ్యాచ్ లు ఆడిన అశ్విన్ 31.73 సగటుతో మొత్తం 142 వికెట్లు తీశాడు. వన్డేల్లో అశ్విన్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కేవలం 25 పరుగులకే నాలుగు వికెట్లు కూల్చడం. వీటితోపాటు 45 అంతర్జాతీయ టీ20 మ్యాచ్ లకు ప్రాతినిధ్యం వహించిన అశ్విన్ 52 వికెట్లు తీశాడు. దీంతో మొత్తం 400 వికెట్లు తీసుకుని సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.