: వికారాబాద్ జిల్లా పేరు మార్చొద్దు: కేసీఆర్ కు ఒవైసీ లేఖ
తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాల ఏర్పాటు అంతిమదశకు వస్తున్న కొద్దీ వినతులు పెరిగిపోతున్నాయి. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి ఓ జిల్లాకు సూచించిన పేరు వద్దని, గతంలో ఉంచిన పేరుతోనే జిల్లాను ఏర్పాటు చేయాలని ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ సూచించారు. రంగారెడ్డిలోని వికారాబాద్ ను జిల్లాగా ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదించారు. వారి ప్రతిపాదనను అంగీకరించిన ముఖ్యమంత్రి ఆ జిల్లాకు అనంతగిరిగా నామకరణం చేద్దామని తెలిపారు. దీనిపై అసదుద్దీన్ వ్యతిరేకత వ్యక్తం చేశారు. వికారాబాద్ పేరు అనంతగిరిగా మార్చవద్దని, వికారాబాద్ గానే ఉంచుతూ జిల్లా ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.