: ఇకపై జిల్లాగా అవతరించనున్న సిరిసిల్ల.. సీఎం గ్రీన్ సిగ్నల్


సిరిసిల్ల పట్టణం ఇకపై జిల్లాగా అవతరించనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సీఎం క్యాంపు కార్యాలయంలో తెలంగాణ లో కొత్త జిల్లాల ఏర్పాటుపై కరీంనగర్ జిల్లా నేతలు, ప్రజాప్రతినిధులతో జరిగిన సమావేశంలో కేసీఆర్ చర్చించారు. ఈ సమావేశంలో మంత్రి ఈటల రాజేందర్, రాజ్యసభ సభ్యుడు కేశవరావు, జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. సిరిసిల్లను జిల్లాగా ఏర్పాటు చేయాలనే అంశంపై ఏకాభిప్రాయం కుదిరిందని, కరీంనగర్ జిల్లాలో ఉన్న హుజూరాబాద్ ను వరంగల్ జిల్లాలో కలపకూడదని నిర్ణయించినట్లు సమాచారం. కాగా, ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో ఉన్న సిరిసిల్లను జిల్లా చేయాలంటూ కొన్ని రోజులుగా డిమాండ్లు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News