: పాతుకుపోయిన లాథమ్ అవుట్... పీకల్లోతు కష్టాల్లో కివీస్!
న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభం నుంచి క్రీజులో పాతుకుపోయిన ఓపెనర్ లాథమ్ (74) ను తన అద్భుత బంతితో రవిచంద్రన్ అశ్విన్ పెవీలియన్ దారి పట్టించడంతో న్యూజిలాండ్ జట్టు టాపార్డర్ ఆటగాళ్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ప్రస్తుతం ఆ జట్టుకు చెందిన రోంచీ (30 బంతుల్లో 15), శాంట్ నర్ క్రీజలో ఉన్నారు. జట్టులో చెప్పుకోతగ్గ జోడీ ఇదే. ఈ జోడీని విడదీస్తే, మిగిలేదంతా టెయిలెండర్లే. ప్రస్తుతం న్యూజిలాండ్ స్కోరు 54 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 141 పరుగులు కాగా, విజయానికి చేయాల్సిన 235 పరుగులు ఆ జట్టు ముందు పెను పర్వతమే. ఇండియా గెలవాలంటే మరో ఆరు వికెట్లు తీయాల్సి వుంది.