: డిసెంబర్ 15 నాటికి అసెంబ్లీ భవనం నిర్మించాలని ఆదేశించాం: స్పీకర్ కోడెల
డిసెంబర్ 15 నాటి కల్లా అసెంబ్లీ భవనం నిర్మించాలని ఆదేశించినట్లు ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ తెలిపారు. వెలగపూడిలో సచివాలయాన్ని సభాపతి కోడెల, మండలి ఛైర్మన్ చక్రపాణి, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సందర్శించారు. ఈ సందర్భంగా కోడెల మాట్లాడుతూ, శీతాకాల సమావేశాలు ఏపీలోనే నిర్వహిస్తామని, సభా నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని అన్నారు. సీఎం, ప్రతిపక్ష నేత, చీఫ్ విప్, విప్ లకు ఛాంబర్ల ఏర్పాటు, సభ జరుగుతున్న సమయంలో సభ్యులకు తాత్కాలిక వసతి కల్పిస్తామని చెప్పారు. సభ్యుల్లో పరివర్తన రావాలని, క్రమశిక్షణ తప్పితే చర్యలు తప్పవని ఈ సందర్భంగా కోడెల హెచ్చరించారు.