: విమానంలో మహిళ పట్ల అసభ్య ప్రవర్తన.. శంషాబాద్ ఎయిర్‌పోర్టు పోలీసులకి ఫిర్యాదు
విమానంలో ప్రయాణిస్తోన్న ఓ మహిళతో మరో ప్రయాణికుడు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన సిల్క్ ఎయిర్‌లైన్స్ విమానంలో చోటుచేసుకుంది. సదరు విమానం ఈరోజు సింగపూర్ నుంచి హైదరాబాద్ శివారులోని శంషాబాద్ ఎయిర్‌పోర్టుకి వచ్చింది. విమానం అక్కడికి చేరుకోగానే ఆ మహిళ ఎయిర్‌పోర్టు పోలీసులకి తనపై ఆ వ్యక్తి చేసిన ప్రవర్తన పట్ల ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సదరు వ్యక్తిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి మలేషియాకు చెందిన ప్రయాణికుడని తెలిపారు. కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.