: వెంటవెంటనే రెండు వికెట్లు డౌన్... కష్టాల్లో న్యూజిలాండ్
నిదానంగా నిలకడగా సాగుతున్న న్యూజిలాండ్ తడబడింది. 376 పరుగుల విజయలక్ష్యంతో ఛేదన ప్రారంభించిన న్యూజిలాండ్ 100 పరుగుల మైలురాయి వద్ద స్వల్ప వ్యవధిలో రెండు కీలక వికెట్లు కోల్పోయింది. క్రీజులో కుదురుకున్న నికోల్స్ ను తన అద్భుతమైన బంతితో జడేజా పెవీలియన్ దారి పట్టించాడు. నికోల్స్ (66 బంతుల్లో 24 పరుగులు) ఆడిన బంతిని రహానే క్యాచ్ చేశాడు. దీంతో 104 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోగా, ఆపై 115 పరుగుల వద్ద కెప్టెన్ టేలర్ ను అశ్విన్ ఎల్ బీ డబ్ల్యూ రూపంలో దొరకబుచ్చుకున్నాడు. దీంతో ఆ జట్టు కష్టాల్లో పడినట్లయింది. ప్రస్తుతం న్యూజిలాండ్ స్కోరు 46 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 123 పరుగులు కాగా, విజయానికి ఇంకా 253 పరుగులు చేయాల్సి వుంది. చేతిలో 7 వికెట్లున్నాయి.