: అమెరికాలో బతుకమ్మ పాటలు పాడిన నిజామాబాద్ ఎంపీ కవిత
తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పే బతుకమ్మ పండుగ వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ ఆడపడుచులు ఈ పండుగను ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఈ సారి 9 దేశాల్లో బతుకమ్మ పండుగను నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నిజామాబాద్ ఎంపీ, జాగృతి అధ్యక్షురాలు కవిత బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ పాట పాడారు. స్వయంగా బతుకమ్మను పేర్చి ఆడపడుచులను ఉత్సాహపరిచారు.