: ప్రధానిని కలిసిన ధోవల్... 'గో ఎహెడ్' చెప్పిన మోదీ!
గత రాత్రి బారాముల్లాలోని రాష్ట్రీయ రైఫిల్స్ క్వార్టర్స్ పై ఫిదాయీల దాడి, ఆపై ఈ ఉదయం పూంఛ్ సెక్టారులో సైనికులపై కాల్పులు, సరిహద్దుల వెంబడి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ తెగబడిన పాకిస్థాన్ సైన్యం... తదితర విషయాలను వివరించేందుకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ కొద్ది సేపటి క్రితం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఆయన నుంచి వివరాలన్నీ విన్న ప్రధాని, ఎటువంటి చొరబాటు, ఉగ్రదాడి, సరిహద్దులకు ఆవలి నుంచి కాల్పులు వంటి ఘటనలను తేలికగా తీసుకోవద్దని, గట్టిగా స్పందించాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. బారాముల్లాలో పరిస్థితిని అడిగి తెలుసుకున్న మోదీ, ఉగ్రవాదులు ప్రాణాలతో పారిపోయిన అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు సమాచారం. వారిని అరెస్ట్ చేయాలని, లేకుంటే ఎన్ కౌంటర్ లో మట్టుబెట్టాలని సూచించినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.