: తాగుబోతులకు మరో ‘చిన్నారి రమ్య’ బలి... మద్యం మత్తులోని యువకుల ర్యాష్ డ్రైవింగ్ కి బ్రెయిన్‌డెడ్‌కు గురైన సంజ‌న


తాగుబోతు మైనర్ బాలురు కారు న‌డిపిన పాపానికి హైదరాబాద్‌లోని పంజాగుట్ట‌లో ఆమధ్య ర‌మ్య అనే చిన్నారితో పాటు ఆమె కుటుంబంలోని ఇరువురు వ్య‌క్తులు చ‌నిపోయి, ఆ చిన్నారి త‌ల్లికి తీవ్ర‌గాయాల‌యిన సంగ‌తి తెలిసిందే. అయితే, ఆ విషాదకర ఘ‌ట‌న‌ను మరువకముందే న‌గ‌రంలోని పెద్ద అంబ‌ర్ పేట‌లో అటువంటి ప్ర‌మాద‌మే ఈరోజు మరొకటి జ‌రిగింది. ఆ ప్రాంతంలోని బ‌స్టాండ్‌లో బ‌స్సు కోసం ఎదురుచూస్తోన్న తల్లీకూతుళ్లను మ‌ద్యం సేవించి ఒళ్లు తెలియ‌కుండా కారు న‌డుపుతున్న ఓ యువ‌కుడు ఢీ కొట్టాడు. ఈ ప్ర‌మాదంలో సంజ‌న అనే చిన్నారికి తీవ్ర‌గాయాలయి బ్రెయిన్‌డెడ్‌కు గురైంది. సంజ‌న త‌ల్లి శ్రీ‌దేవి చావు బతుకుల మధ్య ఆసుపత్రిలో పోరాడుతోంది. కారులో ప్ర‌యాణిస్తోన్న యువ‌కులు ప్ర‌మాదం అనంత‌రం త‌మ కారుని అక్క‌డే వ‌దిలేసి పారిపోయారు. ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు కారులో మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. కేసును ద‌ర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News