: ఈడెన్‌ టెస్టు: మొదటి వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్


కోల్‌కత్తాలోని ఈడెన్‌గార్డెన్స్ లో జరుగుతున్న భారత్‌-న్యూజిలాండ్‌ రెండో టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో నాలుగోరోజు ఆటలో న్యూజిలాండ్ జట్టు మొదటి వికెట్టు కోల్పోయింది. 55 పరుగుల వద్ద గుప్తిల్(24 పరుగులు) అవుటయ్యాడు. న్యూజిలాండ్ ముందు టీమిండియా 376 పరుగుల లక్ష్యాన్ని ఉంచిన విష‌యం తెలిసిందే. ల‌క్ష్య‌ ఛేద‌న‌లో మరోవైపు లాథ‌మ్ 52 బంతుల్లో 31 ప‌రుగులు చేశాడు. గుప్తిల్ 44 బంతుల్లో 24 ప‌రుగులు చేసి అశ్విన్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. విజయానికి న్యూజిలాండ్ టీమ్ మ‌రో 320 పరుగులు చేయాల్సి ఉంది.

  • Loading...

More Telugu News