: జీలం నదిలోకి దూకి పారిపోతున్న ఉగ్రవాదులు... స్పీడ్ బోట్లతో ఛేజింగ్!


నిన్న రాత్రి బారాముల్లా సమీపంలోని 46 రాష్ట్రీయ రైఫిల్స్ హెడ్ క్వార్టర్స్ పై దాడి చేసిన ఉగ్రవాదులు జీలం నదిలో దూకి పారిపోతుండటాన్ని సైన్యం పసిగట్టింది. దీంతో వారిని ప్రాణాలతో పట్టుకునేందుకు ఆర్మీ కమాండోలు భారీ కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. ప్రస్తుతం నదిలో స్పీడ్ బోట్లతో గాలిస్తున్నారు. ఉగ్రవాదులు వినియోగించిన జీపీఎస్, కాంపాస్, ఫెన్సింగ్ కట్టర్, ఏకే 47 మ్యాగజైన్ లను దాడి జరిపిన ప్రాంతంలోనే వదిలి వీరు పరారుకాగా, వాటన్నింటినీ సైన్యాధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలోని వివరాలను బట్టి ఉగ్రవాదులు పాక్ నుంచే చొరబడ్డారని గుర్తించారు. ఇక వీరు తెల్లవారుఝామున తప్పించుకుని పారిపోయినట్టు గుర్తించిన సైన్యం, జీలం నదికి ఆనుకొని ఉన్న గ్రామాల్లోని వ్యక్తులు ఇచ్చిన సమాచారంతో వారు నది మార్గంలో పాక్ వైపు వెళుతున్నారని గుర్తించి ఛేజ్ ప్రారంభించారు. ఈ ఛేజింగ్ ఇంకా కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News