: సుప్రీంకోర్టు 'కావేరీ' ఆదేశాలపై చేతులెత్తేసిన మోదీ సర్కారు!


రేపటిలోగా కావేరీ బోర్డును ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు చేసిన సూచన ఆచరణలో సాధ్యం కాదని మోదీ సర్కారు స్పష్టం చేసింది. ఈ ఉదయం నదీ జలాల అంశం విచారణకు రాగా, దిగువకు నీటిని విడుదల చేయని కర్ణాటక ప్రభుత్వ వైఖరిపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. తాము ఆదేశిస్తున్నా, కర్ణాటక పట్టించుకోవడం లేదని, ఇది రాజ్యాంగ విరుద్ధమని ఆక్షేపించింది. ఆపై తక్షణం ఇరు రాష్ట్రాల అధికారులు, జల నిపుణులతో కావేరీ రివర్ బోర్డును ఏర్పాటు చేసి, నీటి నిల్వ, పంపిణీపై చర్చించాలని ధర్మాసనం ఆదేశించగా, అది ఇప్పట్లో సాధ్యం కాదని కేంద్రం తరఫున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్ తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులను సవరించాలని ప్రభుత్వం తరఫున పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మధ్యాహ్నం విచారణ జరగనుంది.

  • Loading...

More Telugu News