: అరసవల్లిలోని సూర్యనారాయణ స్వామి భక్తులకు మూడో రోజూ నిరాశే ఎదురైంది!
శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలోని సూర్యనారాయణ స్వామి విగ్రహాన్ని అక్టోబర్ 1, 2 తేదీలలో నేరుగా సూర్యకిరణాలు తాకడాన్ని ఎన్నో ఏళ్లుగా భక్తులు పారవశ్యంతో వీక్షిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ ఏడాది ఆ అద్భుతాన్ని చూడడానికి వస్తోన్న భక్తుల కోరిక నెరవేరడం లేదు. స్వామివారి పాదాలను సూర్యకిరణాలు తాకే దృశ్యాన్ని చూడడానికి వచ్చిన భక్తులకు నిన్న, మొన్న నిరాశే ఎదురైంది. అయితే, ఈ రోజయినా ఆ దృశ్యం చూద్దామనుకున్న భక్తులకు ఈరోజు కూడా నిరాశే ఎదురవడం గమనార్హం. ఆకాశం మేఘావృతమై ఉండటం వలనే భాస్కరుడి కిరణాలు స్వామి వారి మూలవిరాట్టుపై ప్రసరించడం లేదు.