: టీమిండియా ఆలౌట్.. న్యూజిలాండ్ ముందు 376 పరుగుల లక్ష్యం
కోల్‌కత్తాలోని ఈడెన్‌గార్డెన్స్ లో కొనసాగుతున్న భారత్-న్యూజిలాండ్ రెండో టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో నాలుగోరోజు బ్యాటింగ్ కొనసాగించిన టీమిండియా 263 పరుగులకి ఆలౌటయింది. మొదటి ఇన్సింగ్స్‌లో 316 పరుగులకి ఆలౌటైన విషయం తెలిసిందే. మరోవైపు భారత బౌలర్ల ధాటికి మొదటి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ బ్యాట్స్ మన్ 204 పరుగులకే ఆలౌటయ్యారు. దీంతో న్యూజిలాండ్ టీమ్ ముందు 376 పరుగుల లక్ష్యం ఉంది. రెండో ఇన్సింగ్స్‌లో న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ లాథమ్, గుప్తిల్ లు బ్యాటింగ్ ప్రారంభించారు. మైదానంలో ఇరు జట్లలో బౌలర్లదే హవా కొనసాగుతోంది. వికెట్లు కాపాడుకుంటూ 376 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాలంటే న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ చెమటోడ్చాల్సిందే.