: ఇంద్రకీలాద్రిపై షార్ట్ సర్క్యూట్... స్వల్ప అగ్నిప్రమాదం


కనకదుర్గమ్మ కొలువైన బెజవాడ ఇంద్రకీలాద్రిపై సిబ్బంది నాసిరకపు పనులతో స్వల్ప అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అలంకరణ నిమిత్తం వేలాడదీసిన విద్యుత్ బల్బుల వరుసలో ఈ ఉదయం షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగాయి. అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది వెంటనే స్పందించి మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది. కాసేపు విద్యుత్ ను నిలిపివేసిన అధికారులు, కాలిపోయిన వైర్లను తొలగించి, విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

  • Loading...

More Telugu News