: నయీంను పెంచి పోషించిన వాళ్ల సంగతేంటి?.. తొలిసారి పెదవి విప్పిన కేసీఆర్
గ్యాంగ్‌స్టర్ నయీం ఉదంతంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తొలిసారి పెదవి విప్పారు. నయీం విషయంలో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా బహిరంగంగా మాట్లాడని సీఎం ఆదివారం ఆయన పేరును ప్రస్తావించారు. టీఆర్ఎస్ నాయకులతో నయీంకు సంబంధాలు ఉన్నాయని అందరూ అంటున్నారని, మరి నయీంను పెంచి పోషించిన వారి సంగతేంటని ఆయన ప్రశ్నించారు. నల్గొండ జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధుల సమావేశంలో నయీం అంశం చర్చకు వచ్చింది. ‘‘నయీంతో ఒక్క టీఆర్ఎస్ నాయకులకే సంబంధాలు ఉన్నట్టు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరి నయీంను పెంచి పోషించిన వారి సంగతేంది? వాళ్లు ఎటుపోవాలె?’’ అని కేసీఆర్ ప్రశ్నించినట్టు తెలిసింది.