: ‘బీటింగ్ రిట్రీట్’... భారత్ వైపు రాళ్లు రువ్విన ‘పాక్’ వాసులు
భారత్-పాక్ సరిహద్దు ప్రాంతమైన వాఘా సరిహద్దు వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ‘బీటింగ్ రిట్రీట్’ సమయంలో భారత్ వైపు పాకిస్థాన్ వాసులు రాళ్లు రువ్వారు. దీంతో, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా, భారత్-పాక్ ల మధ్య రాకపోకలకు అధికారిక మార్గం పంజాబ్ లోని వాఘా సరిహద్దు ప్రాంతం. స్నేహం, సుహృద్భావానికి ప్రతీకగా రెండు దేశాలు ప్రతి రోజూ ‘బీటింగ్ రిట్రీట్’ నిర్వహించడం కొన్నేళ్ల నుంచి వస్తున్న ఆనవాయతి. ప్రతిరోజూ సాయంత్రం వాఘా సరిహద్దు వద్ద ‘బీటింగ్ రిట్రీట్' నిర్వహిస్తుంటారు.