: గాడ్సే విగ్రహాన్ని ప్రతిష్టించడానికి ఇంతకంటే మంచిరోజు ఉండదు: ఏబీహెచ్ఎమ్


గాంధీ జయంతిని పురస్కరించుకుని నాథూరాం గాడ్సే విగ్రహాన్ని ఆవిష్కరించిన సంఘటన మీరట్ లో జరిగింది. అఖిల భారతీయ హిందూ మహాసభ( ఏబీహెచ్ఎమ్) జాతీయ ఉపాధ్యక్షుడు పండిట్ అశోక్ శర్మ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించి కలకలం సృష్టించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గాంధీని అనుసరించకుండా గాడ్సేనే పూజించాలన్నది తమ ధ్యేయమన్నారు. గాంధీ జయంతిని ‘ధిక్కార్ దివస్’గా, ఆయన వర్థంతిని ‘అనన్య దివస్’గా జరుపుకొంటామని అన్నారు. కాగా, నాథూరాం గాడ్సే విగ్రహం ఆవిష్కరించాలనే అంశంపై 2014 డిసెంబర్ లోనే ఎన్నో వివాదాలు చోటుచేసుకున్నాయన్నారు. నాడే ఈ విగ్రహాన్ని ఆవిష్కరించాలని అనుకున్నా సాధ్యపడలేదన్నారు.

  • Loading...

More Telugu News