: మరుగుదొడ్లు లేని వారిని ‘స్థానిక’ ఎన్నికల్లో పోటీకి అనర్హులను చేస్తాం: చంద్రబాబు


మరుగుదొడ్లు లేని వారిని స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులను చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తిరుపతిలో ‘చంద్రన్న బీమా’ పథకం ప్రారంభించారు. ఈ సందర్భంగా బహిరంగ మలమూత్ర విసర్జన రహితమైన మొదటి రాష్ట్రంగా ఏపీని ఆయన ప్రకటించారు. 2018 అక్టోబర్ 2 నాటికి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాధిస్తామని అన్నారు. వచ్చే రెండేళ్లలో 54 లక్షల మరుగుదొడ్లు నిర్మిస్తామని, ప్రతి ఇంటికీ గ్యాస్ అందిస్తామని అన్నారు. దేశంలోనే పరిశుభ్రమైన ఆలయం తిరుమల అని ఈ సందర్భంగా చంద్రబాబు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News