: నెలల తరబడి ఎదురుచూస్తున్నా కేసీఆర్ అపాయింట్ మెంట్ దొరకట్లేదు: కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచందర్ రెడ్డి


నెలల తరబడి వేచిచూస్తున్నా సీఎం కేసీఆర్ అపాయింట్ మెంట్ దొరకడం లేదని మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీ చందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గ ప్రజల సమస్యలపై చర్చించేందుకు ఎమ్మెల్యే హోదాలో సీఎం అపాయింట్ మెంట్ కోరినా లభించడం లేదని అన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్ చేయాలని ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా స్పందించడం లేదన్నారు. కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ సాధన కోసం రేపు అన్ని రాజకీయ పార్టీల నేతలతో కలిసి ఇందిరాపార్క్ వద్ద నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేసేందుకుగాను తాను వైద్య విద్యను వదిలి రాజకీయాల్లోకి వచ్చానని, ఇక్కడి పరిస్థితులు చూస్తుంటే చాలా బాధగా ఉందని వంశీచందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News