: సీపీఎం నేత మధుతో ఫోన్లో మాట్లాడిన జగన్
మెగా ఆక్వాఫుడ్ పార్క్ సందర్శించేందుకు నిన్న భీమవరం వెళ్లిన ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుతో పాటు ఆ పార్టీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో సీపీఎం నేత మధుకు వైఎస్సార్సీపీ అధినేత జగన్ ఈరోజు ఫోన్ చేసి మాట్లాడారు. భీమవరంలో నిన్న జరిగిన పరిణామాల గురించి జగన్ ఆయనను అడిగి తెలుసుకున్నారు. మధు, కార్యకర్తలపై పోలీసులు ప్రవర్తించిన తీరుపై జగన్ అభ్యంతరం వ్యక్తం చేశారు.