: పాకిస్థాన్ మత్స్యకారుల అరెస్ట్.. పడవ స్వాధీనం చేసుకున్న అధికారులు
పాకిస్థాన్ కు చెందిన మత్స్యకారులను భారత్ తీర ప్రాంత అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పడవలో ప్రయాణిస్తున్న 9 మంది మత్స్యకారులు గుజరాత్ తీర ప్రాంతానికి చేరుకోగానే అక్కడి అధికారులు వారి పడవను స్వాధీనం చేసుకుని, వారిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం వారిని పోరు బందర్ కు తరలించారు. కాగా, భారత్- పాక్ ల మధ్య ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత నావికాదళ అధికారులు తీర ప్రాంతంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.