: ఎల్ఓసీ వద్ద కొనసాగుతున్న ఉద్రిక్తత.. పంజ్ తూట్ గ్రామాన్ని ఖాళీ చేయిస్తున్న సైనికులు
జమ్మూకాశ్మీర్ లోని నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది. ఆక్నూర్ సెక్టార్ లోని పంజ్ తూట్ గ్రామాన్ని సైనికులు, అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. ఆక్నూర్ సెక్టార్ లో పాకిస్థాన్ సైనికులు నిన్న కాల్పులకు పాల్పడ్డ నేపథ్యంలో ఈ గ్రామాన్ని ఖాళీ చేయించాల్సి వస్తోందని అధికారులు చెబుతున్నారు. కాగా, గడచిన రెండు రోజుల్లో ఆక్నూర్ సెక్టార్ లో కాల్పుల నిబంధన ఉల్లంఘనకు పాకిస్థాన్ పాల్పడటం ఇది మూడోసారి. అయితే, పాక్ సైన్యానికి దీటుగా మన బీఎస్ఎఫ్ జవాన్లు సమాధానం చెప్పారు.