: డీఎంకే కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతల సమావేశం


చెన్నైలోని డీఎంకే పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. దీనికి స్టాలిన్, పలువురు నేతలు హాజరయ్యారు. తమిళనాడులో తాజా పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం. అయితే, మీడియాతో మాట్లాడేందుకు ఆ పార్టీ నేతలు నిరాకరించారు. కాగా, తీవ్ర అస్వస్థతతో పదకొండు రోజులుగా చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు సీఎం జయలలిత కోలుకోవాలంటూ ఆ పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు దేవుడికి పూజలు చేస్తున్నారు. అయితే, ఆసుపత్రి ప్రాంగణంలోకి ఎవరినీ అనుమతించవద్దని చెన్నై నగర కమిషనర్ జార్జి పోలీసులను ఆదేశించారు.

  • Loading...

More Telugu News