: సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయరాదని నిర్ణయించిన కర్ణాటక


తక్షణమే తమిళనాడు రాష్ట్రానికి ఆరువేల క్యూసెక్కుల నీటిని అక్టోబర్ 1 నుంచి 6 వరకు విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టు శుక్రవారం జారీ చేసిన ఆదేశాలను కూడా కర్ణాటక సర్కారు అమలు చేయలేదు. ఈ విషయమై చర్చించడానికి అక్టోబర్ 3న ఉభయ సభల సమావేశం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై సభాముఖంగా సుప్రీంకోర్టు ఆదేశాలపై సర్కారు తన స్పందన తెలియజేయనుంది. సోమవారం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని కూడా నిర్ణయించింది. ఈ విషయమై సీఎం సిద్ధరామయ్య విలేకరులతో మాట్లాడుతూ... అన్ని పార్టీలు తమిళనాడుకు నీటిని విడుదల చేయరాదని సూచించినట్టు చెప్పారు. అలాగే కావేరీ బోర్డు ఏర్పాటును కూడా ప్రశ్నించాలని సూచించాయన్నారు. నీటి విడుదల విషయమై చర్చించేందుకు శాసనసభను సమావేశపరుస్తున్నట్టు చెప్పారు.

  • Loading...

More Telugu News