: పవన్ గురించి వర్మ తాజా కామెంట్స్... కాపు, కమ్మ కులాల ప్రస్తావన


వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి తన ట్విట్టర్ ఖాతాలో కామెంట్లు పోస్ట్ చేశారు. తెలుగు ప్రజలందరినీ కాపు కాసే అంతిమ శక్తి పవన్ కల్యాణ్ అని తాను భావిస్తున్నానంటూ వర్మ ట్వీట్ చేశారు. పవన్ కల్యాణ్ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అనే విషయం తెలిసిందే. అయితే ఈ ట్వీట్ తర్వాత పోస్ట్ చేసిన మరో ట్వీట్ లో వర్మ కమ్మ కుల ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. చాలా చాలా ‘కమ్మ’గా ‘కాపు’ కాసే శక్తి ఉన్న అత్యుత్తమ నేత పవన్ కల్యాణ్ అంటూ వర్మ తర్వాత ట్వీట్ లో పేర్కొన్నారు. కానీ వర్మ వెంటనే తన ట్వీట్లలోని అసలు అర్థాన్ని మరో ట్వీట్ రూపంలో వివరించారు. కమ్మగా అంటే తియ్యగా అని, కాపు, కమ్మ కులాల కోణంలో వ్యాఖ్యలు కావని, హానికరమైన ఆలోచన గలవారే ఇలా ఆలోచిస్తారనంటూ స్పష్టతనిచ్చారు.

  • Loading...

More Telugu News