: ప్రధాని మోదీ ఛాతీ 100 అడుగులకు విస్తరించింది: చౌహాన్
ప్రధాని నరేంద్రమోదీపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రశంసలు కురిపించారు. ‘ప్రధాని మోదీ ఛాతీ వెడల్పు ఇప్పుడు 56 అంగుళాలు కాదు 100 అంగుళాలు’ అంటూ భోపాల్ లో జరిగిన ఓ కార్యక్రమంలో చౌహాన్ వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ అధీనంలోని భూభాగంలో ఉగ్రవాదులపై భారత ఆర్మీ జరిపిన లక్ష్యిత దాడుల నేపథ్యంలో చౌహాన్ ఇలా వ్యాఖ్యానించారు. ఆర్మీకి, ప్రధానికి శుభాకాంక్షలు తెలిపారు. మన దేశ వృద్ధి రేటు చైనా కంటే ఎక్కువ ఉందని, బలమైన భారత్ అంటే ఏంటో ఇటీవల అందరూ చూశారని అన్నారు.