: చెన్నై అపోలో ఆస్పత్రి వద్ద భారీ బందోబస్తు.. లోపలికి ఎవరినీ అనుమతించవద్దంటూ సీపీ ఆదేశాలు!


చెన్నై అపోలో ఆస్పత్రి వద్ద బందోబస్తును మరింత పెంచారు. ఆస్పత్రిలోకి ఇతరులు ఎవరినీ అనుమతించవద్దంటూ నగర పోలీసు కమిషనర్ జార్జ్ ఆదేశించారు. రాష్ట్ర మంత్రులు ఆదివారం కూడా ఆస్పత్రిలో అమ్మ దర్శనానికి క్యూ కడుతున్నారు. తీవ్ర అస్వస్థతతో 11 రోజు క్రితం సీఎం జయలలిత చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరగా అప్పటి నుంచి ఆమెకు వైద్యులు ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు. సాధారణ అనారోగ్యమేనని, అమ్మకు బాగానే ఉందని, వదంతులు నమ్మవద్దంటూ అన్నాడీఎంకే పార్టీ ప్రకటించినప్పటికీ, ఇన్ని రోజులుగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కాకపోవడంతో ఆమెకు తీవ్ర అనారోగ్యం ఉండి ఉండవచ్చంటూ వదంతులు చెలరేగుతున్నాయి. అయితే, రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు శనివారం ఆస్పత్రిలో ముఖ్యమంత్రి జయలలితను కలసి పరామర్శించడంతోపాటు కోలుకుంటున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు లండన్ బ్రిగేడ్ ఆస్పత్రికి చెందిన వైద్యుడు డాక్టర్ రిచర్జ్ బాలే శనివారం అపోలో ఆస్పత్రికి చేరుకుని జయలలితకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. ఆమెకు అందుతున్న వైద్యం సక్రమంగానే ఉన్నట్టు ఆయన నిర్థారించారు.

  • Loading...

More Telugu News