: ఉగ్రవాది మసూద్ అజర్‌పై చైనా అపార ప్రేమ.. భారత్‌పై మరోమారు వ్యతిరేక వైఖరి


నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ అంటే తనకున్న అపార ప్రేమను చైనా మరోమారు ప్రపంచానికి చాటిచెప్పింది. పఠాన్‌కోట్ ఉగ్రదాడి సూత్రధారి అయిన మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలంటూ ఐక్యరాజ్య సమితిలో భారత్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఇదివరకే తన వీటో అధికారంతో అడ్డుకున్న చైనా మరోమారు అదే పని చేసింది. తన వీటో హక్కును తాజాగా మరో ఆరునెలలు పొడిగించిన చైనా.. మసూద్ నెత్తిపై పాలుపోసింది. నిజానికి చైనా అభ్యంతరం చెప్పకుంటే భారత్ తీర్మానం ఆమోదం పొందేదే. కానీ చైనా తన వీటోను మరో ఆరు నెలలు కొనసాగించాలని నిర్ణయించడంతో మసూద్ బతికిపోయాడు. భారత్ తీర్మానంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మరిన్ని సంప్రదింపుల కోసం తన వీటో అధికారాన్ని పొడిగించినట్టు ఆ దేశ విదేశాంగ అధికార ప్రతినిధి జెంగ్ షుయాంగ్ తెలిపారు.

  • Loading...

More Telugu News